రాష్ట్రంలో ఇద్దరు విశ్రాంత(Retired) సీనియర్ IAS అధికారులను కమిషనర్లుగా ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ అధికారి రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్ గా ఎం.జి.గోపాల్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) శాంతికుమారి ఉత్తర్వులిచ్చారు. ఈ ఇద్దరి పదవీకాలం మూడేళ్ల పాటు ఉంటుంది.