కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ CM భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందులో ఉన్నారు. వీరితోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)కి చెందిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, పౌర సమాజ JAC, విద్యార్థులు, స్టేక్ హోల్డర్స్ సభ్యులుగా ఉంటారు. ఆయా వర్గాలతో మంత్రుల కమిటీ సంప్రదింపులు జరపనుంది. భూ వివాదంపై హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన మధ్యంతర నివేదికతో ఈరోజు సుప్రీంకోర్టు సంచలన రీతిలో ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ చీఫ్ సెక్రటరీ(CS)ని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. వివిధ వర్గాల నుంచి విమర్శలు రావడంతో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.