ఎడ్యుకేషన్ పాలసీ(Education Policy) కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఛైర్ పర్సన్, మెంబర్ కన్వీనర్ సహా ఇతర సభ్యులున్నారు. ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఛైర్ పర్సన్ గా కమిటీ ఏర్పాటైంది. MLA కడియం శ్రీహరి, రిటైర్డ్ IAS ఆకునూరి మురళి, CS కె.రామకృష్ణారావు, ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి సభ్యులు కాగా.. విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. విద్యావిధానాన్ని అధ్యయనం చేయడంతోపాటు వృత్తివిద్యలో సాంకేతికత, సంస్కరణల కోసం ఈ కమిటీ సిఫార్సులు అందిస్తుందని సర్కారు తెలిపింది.