వరదల(Floods) వల్ల సర్వం కోల్పోయి దీనావస్థలో ఉన్న కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. వర్షాలతో దెబ్బతిన్న ప్రతి ఇంటికీ రూ.16,500 ఇవ్వాలని నిర్ణయించింది. ఇది ప్రస్తుతం రూ.10 వేలు ఉండగా ఆ మొత్తాన్ని పెంచినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 33 మంది ప్రాణాలు కోల్పోయారని, బాధిత కుటుంబానికి రూ.5 లక్షలతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందించాలని ఆదేశించారు.
వరద సహాయం నేరుగా లబ్ధిదారుల(Beneficieries)కు అందే విధంగా వారి అకౌంట్లలో నగదు జమ చేస్తున్నామని పొంగులేటి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 358 గ్రామాల్లో 2 లక్షల మంది బాధితులయ్యారన్నారు.