
టీవీల్లో వస్తున్న పోటాపోటీ ప్రకటనలు(Advertisements) ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల వేళ ఓటర్ల వద్ద ప్రత్యక్షంగా చేసుకుంటున్న ప్రచారం కంటే టెలివిజన్లలో కనిపిస్తున్నవే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇవే ప్రకటనలు రెండు పార్టీల మధ్య లీగల్ యుద్ధానికి దారితీస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(Chief Electoral Officer) వికాస్ రాజ్ ను కలిసిన BRS లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్.. కాంగ్రెస్ పార్టీ తయారు చేయించిన ప్రకటనలతోపాటు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని CMను కించపరిచే విధంగా అడ్వర్టయిజ్ మెంట్స్ ఉంటున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
KCRను రేవంత్ రెడ్డి దుర్భాషలాడుతున్నారని, ఆయన్ను ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే బ్యాన్ చేసిన అడ్వర్టయిజ్ మెంట్లను కూడా బ్యాన్డ్ అని పెట్టి మరీ టెలికాస్ట్ చేస్తున్నారని కంప్లయింట్ లో తెలియజేశారు. మరోవైపు నాయకులు, కార్యకర్తలను రెచ్చగొడుతూ రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తున్నారని వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు.