IAS, IPS లాంటి పోస్టుల్లో రిజర్వేషన్లు అవసరమా అంటూ తన ‘X’ ఖాతాలో సీనియర్ IAS స్మితా సబర్వాల్ ట్వీట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తిన వేళ.. ఏకంగా ఆమెపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC)కి ఫిర్యాదు అందింది. దివ్యాంగుల మనోభావాలు దెబ్బతీసి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని భంగపరిచారంటూ కాంగ్రెస్ నాయకుడు బక్కా జడ్సన్ కంప్లయింట్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి స్మిత సబర్వాల్ మిగతా అధికారులకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదులో బక్కా జడ్సన్ తెలియజేశారు. ఆయన కంప్లయింట్ ను స్వీకరించినట్లు NHRC రిప్లయ్ ఇచ్చింది.
క్షేత్రస్థాయి(Ground Level)లో పనిచేసే IAS, IPSలకు శారీరక దృఢత్వం కావాలని, వైక్యలం ఉన్నవారిని పైలట్లుగా విమానయాన సంస్థలు నియమిస్తాయా.. వైకల్యం గల సర్జన్ల సేవలను మీరు విశ్వసిస్తారా అంటూ ఆమె పెట్టిన కామెంట్స్ దుమారం రేపాయి.