
ఎన్నికల హామీలతో కూడిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలైంది. 37 అంశాలు, 42 పేజీల మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీభవన్ లో రిలీజ్ చేశారు. శ్రీధర్ బాబు కన్వీనర్ గా ఏర్పాటైన కమిటీ దీనికి రూపకల్పన చేసింది. KCR పని అయిపోయిందని, తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
మేనిఫెస్టోలోని అంశాలు
- ధరణి స్థానంలో భూమాత పోర్టల్
- జూనియర్ లాయర్లకు నెలకు రూ.5,000 భృతి
- BC సబ్ ప్లాన్.. EBCలకు సంక్షేమ బోర్డు
- దివ్యాంగుల పింఛను రూ.5,016కు పెంపు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
- గల్ఫ్ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు
- ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్స్
- ప్రభుత్వాసుపత్రుల డెవలప్ మెంట్.. మెరుగైన వైద్యం
- బీసీ కులగణన చేపట్టి రిజర్వేషన్లు
- ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి రూ.12,000
- సంచార జాతులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 5% రిజర్వేషన్లు
- ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల స్థలం
- ఆడపిల్లల పెళ్లికి రూ.లక్షతోపాటు 10 గ్రాముల బంగారం
- అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.25,000 పింఛన్, ఒకరికి ప్రభుత్వోద్యోగం
- రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ
- రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలు
- గతంలో పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలకు భూహక్కులు
- బడ్జెట్ లో విద్యారంగం వాటా 15 శాతం పెంపు
- ఆరు నెలల్లోపు మెగా DSC
- పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయంతో కూడిన ‘బంగారు తల్లి’
- సర్పంచుల ఖాతాల్లోకి విలేజ్ డెవలప్మెంట్స్ ఫండ్స్
- మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షలు
- ప్రభుత్వ ఉద్యోగులకు OPS విధానం
- SC వర్గీకరణ తర్వాత కొత్తగా 3 కార్పొరేషన్లు
- బెల్డ్ షాపులు పూర్తిగా రద్దు