MLA కోటా MLC ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థుల్ని ప్రకటించింది. ముందునుంచీ పార్టీని నమ్ముకున్న వారికే టికెట్లు దక్కాయి. మూడు స్థానాలకు పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించగా, మరో సీటును మిత్రపక్షమైన CPIకి కేటాయించింది. అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను AICC ఖరారు చేసింది. మొత్తం ఐదు MLC స్థానాలు ఖాళీ అవుతుండగా.. హస్తం పార్టీలో విపరీతమైన పోటీ ఏర్పడింది. BC, SC, ST సామాజికవర్గాల వారీగా అభ్యర్థిత్వాలను ప్రకటించారు. PCC జనరల్ సెక్రటరీగా దయాకర్, నల్గొండ DCC అధ్యక్షుడిగా శంకర్ నాయక్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్న విజయశాంతి పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ.