ప్రభుత్వ విప్ లు, మంత్రులు, డిప్యూటీ CM… ఇలా కాంగ్రెస్ పెద్దలంతా బుజ్జగిస్తున్నా MLC జీవన్ రెడ్డి మనసు మారడం లేదు. రాజీనామా(Resignation) చేయడమే తనకున్న ఏకైక మార్గమని భావిస్తుండగా… భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు MLC నివాసానికి వెళ్లారు. మండలి సభ్యత్వానికి రాజీనామా చేసి సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని భీష్మించారు.
రెండ్రోజులుగా…
దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా ఉంటున్నా తన ప్రమేయం లేకుండా జగిత్యాల MLA సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. నిన్ననే రాజీనామా చేస్తాననడంతో విప్ లు లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ జగిత్యాల వెళ్లారు. వినకపోవడంతో మంత్రి శ్రీధర్ బాబు రంగప్రవేశం చేశాక రాత్రికల్లా పరిస్థితి కుదుటపడ్డట్లే కనిపించింది.
కానీ ఈరోజు…
నిన్నట్నుంటి అన్యమనస్కంగా(Out Of Mind)నే ఉంటున్న జీవన్ రెడ్డి.. MLC పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనకు వచ్చారు. ఉప ముఖ్యమంత్రి వెళ్లినా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. సెగ్మెంట్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు నడచుకుంటానని ఆయన అంటున్నారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ(Anxiety) పార్టీలో ఏర్పడింది.