స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అమలుపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతుల(BC)కు 42 శాతం టికెటివ్వాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC) నిర్ణయించింది. హైకోర్టు తీర్పు మేరకు సెప్టెంబరు 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా రిజర్వేషన్ల వ్యవహారం ముందుకు సాగడం లేదు. దీంతో పార్టీపరంగానైనా టికెట్ల విషయంలో వాటిని అమలు చేయాలన్న తీర్మానానికి నేతలు వచ్చారు.