రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నాడు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయంది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరాలకు సమీపంలో ఆవర్తనం వల్ల అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాగల 36 గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తరు… కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది.
హైదరాబాద్ లో వానలే వానలు
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వానలే వానలు అన్నట్లు ఉంది పరిస్థితి. మల్కాజిగిరి, నిజాంపేట, కేపీహెచ్ బీ, జీడిమెట్లతోపాటు వివిధ ఏరియాల్లో వర్షం పడి రోడ్లపై నీరు నిలిచింది.