Published 26 Dec 2023
కరోనా రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న వేళ ఇద్దరు కొవిడ్ రోగులు మృతిచెందడం భయానికి కారణమైంది. క్రమంగా పెరుగుతున్న కొవిడ్ కేసులతో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితి ఏర్పడిన వేళ.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ ఘటన జరగడం వైద్యారోగ్య వర్గాలను కలవరపాటుకు గురిచేసింది. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital)కి వచ్చిన ఇద్దరు పేషెంట్లు వైద్యం కోసం అక్కడ చేరారు. ఆ ఇద్దరికీ అనుమానంతో కొవిడ్ టెస్టులు చేస్తే.. ఇరువురికీ పాజిటివ్ వచ్చింది.
అయితే వారిద్దరూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయినా వారికి జరిపిన టెస్టుల్లో పాజిటివ్ రావడం ఆందోళనకు కారణమైంది.