
తుపాను(Cyclone) ప్రభావం రైతులను కోలుకోకుండా చేసింది. అసలే ఈ వర్షాలతో అంతంతమాత్రంగానే ఉన్న పంటలు.. ఈ తుపానుతో పూర్తిగా కొట్టుకుపోయాయి. అన్ని జిల్లాల్లో వరి(Paddy), పత్తి, మిర్చి పంటలు నీటిపాలయ్యాయి. కొనుగోలు కేంద్రాలు, నిల్వ చేసిన ప్రాంతాల్లో ధాన్యమంతా తడిసి కర్షకులు లబోదిబోమంటున్నారు. పెట్టుబడి పూర్తిగా పోయినట్లే. నల్గొండ జిల్లాలోనే ఐదున్నర లక్షల ఎకరాల్లో పంటలు కోల్పోవాల్సి వచ్చింది.