317 జీవోలో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించేలా చూడాలని ఉన్నతాధికారుల్ని మంత్రివర్గ(Cabinet) ఉపసంఘం(Sub-Committee) ఆదేశించింది. కొత్త జిల్లాలు, జోన్ల వారీగా సర్దుబాట్లకు అనుగుణంగా గత ప్రభుత్వం 317 జీవో తెస్తే… దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత జిల్లాల వారీగానే ఉద్యోగుల సర్వీస్, ప్రమోషన్ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని డిసైడ్ అయింది.
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన మిగతా మంత్రులైన కమిటీ సభ్యులు శ్రీధర్ బాబు, ప్రభాకర్ ఆధ్వర్యంలో మరోసారి సమావేశం జరిగింది. శాఖల వారీగా ఇంకా అధికారులు పూర్తిగా సమాచారం ఇవ్వలేదని కమిటీ గుర్తించింది.
ఈ భేటీలో మొత్తం తొమ్మిది శాఖలపై చర్చ జరిపారు. యుద్ధ ప్రాతిపదికన సమాచారం ఇచ్చేలా పర్యవేక్షించాలంటూ సీనియర్ IAS, IPS అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. వెబ్ పోర్టల్ ద్వారా అందిన అప్లికేషన్లు మొత్తం 52,235 ఉండగా.. అందులో విద్యాశాఖ నుంచి 20,209తో, హోం శాఖ 11,417తో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.