రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూళ్లకు భూముల గుర్తింపుపై చీఫ్ సెక్రటరీ(CS) శాంతికుమారి సమీక్ష(Review) నిర్వహించారు. ఈ సంవత్సరం ఎనిమిది పాఠశాలలు గ్రౌండింగ్ కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. పనుల్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారు(Adviser)తో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.
సోషల్ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి నోడల్ ఆఫీసర్ గా, ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేయాలని CS ఆదేశించారు. 49కి గాను 8 స్కూళ్లు ఈ ఏడాది ప్రారంభం కానుండగా.. 31 పాఠశాలలకు ఇప్పటికే కలెక్టర్లు భూమిని గుర్తించారు.
మరో 10 స్కూళ్లకు భూమిని గుర్తించాల్సి ఉందని అధికారులు CSకు వివరించారు. సీనియర్ IASలు నవీన్ మిట్టల్, శ్రీధర్, అలుగు వర్షిణి, తఫ్సీర్ ఇక్బాల్ తదితరులు తాజా పరిణామాల్ని ఆమెకు తెలియజేశారు.