రానున్న మూడు రోజుల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు(heavy rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) చేసిన హెచ్చరికలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. సీనియర్ అధికారులతోపాటు జిల్లాల్లోని అఫీషియల్స్ తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, సిద్ధిపేట, ఖమ్మం, కొత్తగూడెం, జనగాం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో భారీ వానలు ఉన్నందున ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ అయింది. మరో మూడు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని IMD హెచ్చరించడంతో అందరూ జాగ్రత్తగా ఉండాలని CS సూచించారు.
లోతట్టు ప్రాంతాలను గుర్తించడంతోపాటు ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లు, మండలాల్లో కంట్రోల్ రూమ్ లు అందుబాటులో ఉంచాలని, అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అధికారులు అలర్ట్ గా ఉండాలని CS శాంతికుమారి స్పష్టం చేశారు.
Be alert