రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్వర్తులు జారీ చేసింది. బేసిక్, పెన్షన్ పై 2.73 శాతం డీఏ పెరగనుండగా.. ఇది 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. జూన్ వేతనం, పెన్షన్ తోపాటు పెరిగిన డీఏను జులైలో చెల్లించనుంది. అయితే బకాయిలను తర్వాత రిలీజ్ చేయనుంది. డీఏ పెంపుతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి కలగనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ పెంపుతో ఖజానాపై నెల నెలా రూ.81.18 కోట్లు, సాలీనా రూ.974.16 కోట్ల అదనపు భారం పడనుందన్నారు. పెంచిన డీఏ ప్రకారం రూ.1,380 కోట్ల ఎరియర్స్ ను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుంది.