కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అక్టోబరు 2 నుంచి దరఖాస్తులు(Applications) స్వీకరించాలని CM రేవంత్ ఆదేశించారు. రేషన్ కార్డుల జారీ, విధివిధానాల(Guidelines)పై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహతో సమీక్ష నిర్వహించిన CM.. అర్హులందరికీ ఇక నుంచి డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చే అంశంపై కసరత్తు చేయాలన్నారు. ఈ అంశంపై త్వరలోనే మరోసారి రివ్యూ నిర్వహించాలని నిర్ణయించారు.