జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన కూతురు తనకన్నా పెద్ద స్థాయికి చేరడం ఒకెత్తయితే… ఆ కుమార్తె తనకన్నా పెద్ద ఆఫీసరైతే… చిన్నప్పట్నుంచీ కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ చేతులే పుత్రికకు సెల్యూట్ చేస్తే… ఇంతకన్నా హృదయాన్ని హత్తుకునే సీన్ మరొకటి ఉండదేమో. ఇలాంటి అరుదైన దృశ్యమే తెలంగాణ పోలీస్ అకాడెమీలో కనిపించింది.
ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో ఆలిండియా మూడో ర్యాంకు సాధించారామె. ఆమె తండ్రి మాత్రం సీనియర్ పోలీస్ అధికారిగా అంచెలంచెలుగా ఎదిగి SP స్థాయికి చేరుకుని జిల్లా బాస్ గా సేవలందించారు. ఈ మధ్యనే IAS సాధించిన నూకల ఉమాహారతి.. శిక్షణ(Trainee)లో భాగంగా రాష్ట్ర పోలీస్ అకాడెమీ(Police Academy)కి చేరుకున్నారు.
అక్కడే SP ర్యాంక్ లో ఉన్న ఆమె తండ్రి వెంకటేశ్వర్లు కూతురుకు ఘనంగా వెల్ కమ్ చెప్పారు. పూల బొకే ఇచ్చి ఆమెకు సెల్యూట్ చేశారు. సెల్యూట్ తో కూడిన తండ్రి ఆహ్వానానికి ఆ ఐఏఎస్ అమ్మాయి మోము దరహాసంతో వెలిగిపోయింది. ఈ దృశ్యం అక్కడున్నవారందర్నీ కదిలించింది.