శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(SLBC) టన్నెల్ ప్రమాదంలో చివరకు విషాదమే మిగిలినట్లు కనపడుతోంది. గల్లంతైనవారి కోసం ఏడో రోజూ విస్తృతంగా గాలిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషిన్(TBM)ను ప్లాస్మా గ్యాస్ కట్టర్లతో ద.మ.రైల్వే ఇంజినీర్లు ముక్కలు చేశారు. బురద, నీటి తొలగింపు అనంతరం ఆ ప్రాంతంలో మెత్తటి భాగాలు కనపడ్డాయి. దీంతో అవి మృతదేహాలే అయి ఉంటాయా అన్న అనుమానాలు కనపడుతున్నాయి. అయితే ఈ ప్రచారం సరికాదని అధికారులు అంటున్నారు. ఈరోజు అత్యాధునిక గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(GPR)ను వ్యవస్థను సొరంగంలోని పంపించారు. NDRF, SDRF, నేవీ, ఆర్మీ, సింగరేణి, BRO బృందాలు లోపలికి వెళ్లగా.. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, NGRI, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు సొరంగాన్ని స్కాన్ చేశారు. మూడు మీటర్ల లోతులో మెత్తగా కూడిన భాగాల్ని TBM ముందు భాగంలో.. పరికరాల ద్వారా గుర్తించగలిగారు. అయితే అవి మానవదేహాలా, కావా అన్నది తేలాల్సి ఉంది.