పిడుగుపాట్లకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. జోగులాంబ(Jogulamba) గద్వాల జిల్లా అయిజ మండలం భూంపురంలో ముగ్గురు చనిపోయారు. పత్తి చేనులో పనిచేస్తున్న కూలీలపై పిడుగు పడింది. ఇద్దరు మహిళలు, ఒక యువకుడు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబి మండలం ఎంగెలాపూర్లోనూ పొలం నుంచి వస్తుండగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇక ఖమ్మం జిల్లాలోనూ రెండుచోట్ల పిడుగులు పడ్డాయి. ఒక చోట ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరోచోట ఇంకొకరు గాయపడ్డారు. వర్షంలో సెల్ ఫోన్ మాట్లాడుతుండగా దుర్ఘటన జరిగింది.