శనివారం(ఈనెల 6న) నాలుగు జిల్లాలకు సెలవు(Holiday) ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు సాధారణ సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో గణేశ్ నిమజ్జనం కోసం ఈ వెసులుబాటు కల్పించింది. బదులుగా అక్టోబరు 11 రెండో శనివారాన్ని వర్కింగ్ డేగా తెలియజేసింది. https://justpostnews.com