మూడు గంటల పాటు ఏకబిగిన(Continue) అసౌకర్యమైన గదుల్లో(Rooms) కూర్చోవడం.. పొద్దున 7:45 నుంచి మధ్యాహ్నం 1:45 గంటల వరకు భోజనం చేయకుండా ఉండటం పిల్లలకు ఎలా సాధ్యమో అర్థం కావడం లేదంటూ గురుకులాల పనితీరుపై ఉద్యోగ సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. శాస్త్రీయత లోపించి విద్యార్థులకు మానసిక ఒత్తిడిని కలిగిస్తున్న సమయపాలన(Timings)ను మార్చాలని TSUTF డిమాండ్ చేసింది.
గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా గురుకులాలు ఏర్పాటు చేసినా అరకొర సౌకర్యాలు, అద్దె భవనాల్లోనే కొనసాగడం.. కొన్నిచోట్ల భయంకరంగా మారిన భవనాల్లో గంటలపాటు కూర్చోవడం వల్ల పిల్లలు, గురువులు ఇబ్బందులు పడటాన్ని ఆ సంఘం నాయకులు గుర్తుచేస్తున్నారు. ఊరికి దూరంగా ఉన్న విద్యాలయాల్లో అయితే పొద్దున వెళ్లిన మాస్టార్లు, ఇతర స్టాఫ్.. రాత్రి 9 గంటల వరకు అక్కడే ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదని అంటున్నారు.
విద్యాహక్కు చట్టం, బాలల హక్కుల కమిషన్ రూల్స్ మేరకు విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకుని గురుకులాల పనివేళల్లో మార్పులు చేయాలని UTF అధ్యక్షుడు జంగయ్య, జనరల్ సెక్రటరీ చావ రవి డిమాండ్ చేస్తున్నారు.
ఈ time table వల్ల పిల్లలు మానసిక ఒత్తిడితో పాటు శారీరకంగా ఒత్తిడిని అనుభవిస్తారు. అమ్మాయిలకైతే స్పెషల్ డేస్లో చాలా కష్టంగా ఉంటుంది. సరైన fecilities లేని స్కూల్స్ చాలా ఉన్నాయ్. టీచర్స్ విషయానికి వస్తే up&down చేసే వాళ్ళ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇంట్లో వాళ్ల పిల్లలను కనీసం చూసుకునే అవకాశం లేకుండ పోతుంది. పైనుండి ఆర్డర్స్ పాస్ చేయడం కంటే ఒక్కరోజు teacher లాగా పని చేసి అప్పుడు ఈ నిర్ణయం తీసుకోండి. దయచేసి ఇది తప్పుగా అనుకోవద్దు కానీ ఆలోచించండి. టీచర్లుకి family ఉంటుందని