రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతోపాటు పలువురు డిప్యూటీ కలెక్టర్లను ట్రాన్స్ ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రమోషన్ పొందిన మొత్తం 30 మందికి పోస్టింగ్ లు కట్టబెట్టింది. మెట్ పల్లి RDOగా మధు నియమితులయ్యారు. ఉట్నూరు RDOగా ఎల్.జివాకర్ రెడ్డి, బెల్లంపల్లి RDOగా డి.కొమరయ్య, మంచిర్యాల RDOగా వి.రాములు, కల్లూరు RDOగా ఎస్.అశోక్ చక్రవర్తి, నారాయణఖేడ్ RDOగా ఎన్.వెంకటేశ్, నాగర్ కర్నూల్ RDOగా కె.వెంకటరెడ్డిని నియమించింది.