రాష్ట్రవ్యాప్తంగా పలువురు డిప్యుటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వివిధ జిల్లాల్లో మొత్తం 25 మందిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థాన చలనం కలిగిన పోస్టుల్లో ఎక్కువగా ఆర్డీవో(Regional Development Officer)లు ఉన్నారు. ఎన్నికల సంఘం(EC) ఆదేశాల ప్రకారం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతున్నాయి. పోలీస్ డిపార్ట్ మెంట్ లో SPల నుంచి SIల దాకా స్థానచలనం(Transfer) కల్పించారు. ఇక రెవెన్యూ విభాగంలోనూ భారీయెత్తున కదపాల్సి ఉన్నందున ప్రస్తుతం 25 మంది డిప్యుటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్స్ ఇష్యూ చేసింది.
బదిలీ అయిన అధికారుల లిస్టు ఇలా…
ఎం.నగేశ్ – అడిషనల్ కలెక్టర్, వనపర్తి
కనుగుల శ్రీనివాస్ – DRO, వరంగల్
డి.రాజ్యలక్ష్మీ – DRO, నల్గొండ
కె.మహిపాల్ – RDO, హైదరాబాద్
కె.వెంకట ఉపేందర్ రెడ్డి – RDO, కీసర
ఎస్.రాజు – RDO, జహీరాబాద్
గట్టు సంధ్యారాణి – అడిషనల్ కలెక్టర్, వరంగల్
డి.పద్మజారాణి – RDO, సంగారెడ్డి
ఎల్.రమాదేవి – భద్రాచలం రామాలయ EO(కంటిన్యూ)
ఆర్.దశరథ్ సింగ్ – RDO, సికింద్రాబాద్
కొప్పుల వెంకట్ రెడ్డి – RDO, రాజేంద్రనగర్
బి.శకుంతల – RDO, హుజూరాబాద్