మరోసారి భారీ స్థాయిలో డిప్యుటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 40 మంది స్థాన చలనం(Transfers) కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో డిప్యుటీ కలెక్టర్లతోపాటు స్పెషల్ గ్రేడ్ డిప్యుటీ కలెక్టర్లు సైతం ఉన్నారు. ఆదిలాబాద్ RDO స్రవంతి బ్రహ్మరౌతును వరంగల్ RDOగా.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ RDO టి.వినోద్ కుమార్ ను భూపాలపల్లి(LA & RR) స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ గా ట్రాన్స్ ఫర్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ పర్సా రాంబాబును జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గా… సూర్యాపేట అదనపు కలెక్టర్ ఎరమాద వెంకట్ రెడ్డి ని హన్మకొండ అదనపు కలెక్టర్ గా.. జగిత్యాల అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లతను సూర్యాపేట అదనపు కలెక్టర్ గా నియమించారు.