రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ(transfer) చేసింది. మొత్తం 31 మంది ట్రాన్స్ ఫర్ అయినవారిలో ఉన్నారు. రెవెన్యూలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్(SDC) స్థాయిలో ఉన్న వీరందరినీ బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. డి.మధుసూదన్ నాయక్ ను మంచిర్యాల నుంచి ఖమ్మంకు, జి.రమేశ్ ను మెదక్ నుంచి ULC హైదరాబాద్ కు, వెయిటింగ్ లో ఉన్న డి.వేణుగోపాల్ ను ములుగుకు, కె.వెంకటేశ్వర్లు(వెయిటింగ్)ను భూపాలపల్లికి స్థానచలనం కలిగించారు.
ముసిని వెంకటేశ్వర్లును హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ కు, కె.సీతారామారావు(వెయిటింగ్) ఆసిఫాబాద్ కు, నూతి మధుసూదన్ ను ఖమ్మం నుంచి హైదరాబాద్ కు, ఎ.పద్మశ్రీని హైదరాబాద్ నుంచి మెదక్ DROగా, జి.వెంకటేశ్వర్లు(వెయిటింగ్)ను మెదక్ కు, వి.భుజంగరావును వేములవాడ నుంచి బాన్సువాడకు కె.శ్యామలాదేవిని బెల్లంపల్లి నుంచి ఉట్నూరుకు, జె.ఎల్.బి.హరిప్రియను రంగారెడ్డి నుంచి మేడ్చల్ మల్కాజిగిరికి బదిలీ చేశారు.