లక్షల్లో పేరుకుపోయిన ‘ధరణి’ సమస్యల్ని పరిష్కరించడం(Solved) అంత సులువు కాదు. మరి ఆ సమస్యలన్నింటికీ సత్వర పరిష్కారం లభించాలంటే ఏం చేయాలి.. సరిగ్గా ఇదే కోణంలో ప్రభుత్వం ఆలోచన చేసింది. ఐదుగురు సభ్యుల ‘ధరణి’ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు అధికారులకు అధికారాల్ని బదలాయించిన సర్కారు… వారికి గడువు(Time Limit) కూడా విధించింది. తహసీల్దార్ నుంచి కలెక్టర్ దాకా అందరూ తమకు కేటాయించిన గడువులోగా పోర్టల్ లోని సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంటుంది.
నేటి నుంచే…
అధికారాల విభజనతోపాటు మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు వేసిన ప్రభుత్వం… ‘ధరణి’ అపరిష్కృత సమస్యల కోసం నేటి నుంచే స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ఈనెల 9 వరకు సాగే ఈ స్పెషల్ డ్రైవ్ లో అన్ని స్థాయిల్లో విచారణలు నిర్వహించి ఫైల్స్ పరిశీలించాలని తర్వాత వాటిని కంప్యూటర్లలో రికార్డు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
పరిశీలన ఇలా…
నాలుగు రకాల మాడ్యుల్స్ ను తహసీల్దార్లు చూస్తారు. ఆ తర్వాత స్థాయిలో ఆరు రకాల మాడ్యుళ్లను RDOలు పరిశీలించాల్సి ఉంటుంది. RDOల విచారణ అనంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల సమస్యలపై కలెక్టర్లు దృష్టిపెడతారు.
పరిష్కారానికి అధికారుల గడువు ఇలా…
తహసీల్దార్ – 7 రోజులు
ఆర్డీవో(RDO) – 3 రోజులు
అదనపు కలెక్టర్(రెవెన్యూ) – 3 రోజులు
కలెక్టర్ – 3 రోజులు