మూడో తరగతి వరకు అంగన్వాడీల్లో.. 4 నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. అంగన్వాడీకో ప్రైమరీ టీచర్.. ఇలాంటి ప్రతిపాదనల నడుమ ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన మొదలైంది. మూడో తరగతి వరకు కలపడం(Merge) వల్ల ప్రాథమిక పాఠశాలలు ఇక ఉండబోవు అన్న చర్చ జోరందుకుంది.
క్లారిటీ దిశగా…
రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది ప్రైమరీ టీచర్లుంటే అంగన్వాడీలకు పోను మిగతా సగం పోస్టులను ఏం చేస్తారనే ప్రశ్న వస్తున్న తరుణంలో.. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఆలోచన చేసినట్లుగా కనపడుతున్నది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిట్ చాట్ చేయడాన్ని బట్టి త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
వేర్వేరుగా సిబ్బంది…
అంగన్వాడీ సిబ్బంది(Staff) వేరు.. మూడో తరగతి వరకు బోధించే ఉద్యోగులు(Employees) వేరు అన్నది భట్టి మాటల్లోని అంతరార్థం. ఒకవేళ అంగన్వాడీల్లోనే ప్రైమరీ క్లాసుల్ని నిర్వహిస్తే మాత్రం ఉద్యోగులు, సిబ్బందిని వేర్వేరుగా పరిగణించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన దృష్ట్యా.. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది క్వశ్చన్ మార్క్ గా తయారైంది.
ట్రాన్స్ పోర్ట్ సైతం…
విద్యార్థులకు ఉచిత ప్రయాణం.. నిరుద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ దిశగా సర్కారు ఆలోచన చేస్తున్నది. ఇక 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్స్ తోపాటు ప్రతి మండలానికొక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించాలన్నది సర్కారు లక్ష్యంగా ఉంది.