రాష్ట్రంలో 156 డాక్టర్(Doctor) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో 54 ఆయుర్వేదం, 33 హోమియో, 69 యునాని పోస్టులున్నాయి. ఇందుకోసం ఆగస్టు 7 నుంచి 22 వరక ఆన్ లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. వైద్యశాఖను బలోపేతం చేసే లక్ష్యంతో కొత్తగా డాక్టర్లను రిక్రూట్ చేసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఖాళీలున్న ప్రాంతాలను గుర్తించి ఈ డాక్టర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.