రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశంతో డీఎస్సీ రాసే అభ్యర్థులకు వెసులుబాటు(Flexibility) లభించింది. తాజా టెట్ లో ఉత్తీర్ణులు(Pass) అయినవాళ్లు ఉచితం(Free)గా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ(School Education) తమ వెబ్ సైట్లో మార్పులు చేసింది. ఫ్రీ అప్లికేషన్ విధానం శనివారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.
భారీగా పెరిగిన టెట్ ఫీజును ఎన్నికల కోడ్ వల్ల తగ్గించలేకపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్ పాస్ కానివారు మాత్రం వచ్చేసారి నిర్వహించే ఎగ్జామ్ కు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.