ఈ నెల 18 నుంచి వచ్చే నెల 5 వరకు జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్షల(DSC) కోసం హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యాశాఖ వెబ్సైట్(Website) ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. schooledu.telangana.gov.in ద్వారా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ(School Education) తెలిపింది.
డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలన్న ఆందోళనలు.. బయట జరుగుతున్న ప్రచారంపై నిన్ననే విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. అవి యథావిధిగానే నిర్వహిస్తామంటూ.. విపరీతమైన ఊహాగానాలకు చెక్ పెట్టింది.
ఈ నెల 19 నుంచి 23 వరకు మాత్రం వివిధ సబ్జెక్టులకు సంబంధించి SGT పరీక్షలు నిర్వహిస్తున్నారు. CBRT విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.