DSC ఫలితాల(Results)కు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 11,062 పోస్టులకు గాను జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన పరీక్షలకు 2.46 లక్షల మంది హాజరయ్యారు. అక్టోబరు 9న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి LB స్టేడియంలో నియామక పత్రాలను దసరా కానుకగా అందజేయనున్నారు. కేవలం 55 రోజుల్లోనే ఫలితాలు ఇచ్చామని CM తెలిపారు.
1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల(Certificate) పరిశీలన(Verification) జరగనుండగా.. కేవలం 55 రోజుల్లోనే ఫలితాలు ఇచ్చామని CM తెలిపారు. ఫలితాల్లో కేవలం మార్కులు, ర్యాంక్ మాత్రమే ఉండగా.. మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సెలక్టెడ్ లిస్టును జిల్లాల వారీగా DEOలకు పంపించనున్నారు.