DSC పరీక్షల్ని వాయిదా వేయాలంటూ చేస్తున్న ఆందోళనలపై ఉప ముఖ్యమంత్రి(Deputy CM) భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. ఇదే చివరి DSC కాదని త్వరలోనే మరో డీఎస్సీని నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. పదేళ్లుగా టీచర్ల రిక్రూట్మెంట్లు లేవని, తాము మరోసారి ఐదారు వేల పోస్టులతో నియామకాలు చేపడతామన్నారు.
16 వేల ఖాళీలు…
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశీలిస్తే 16 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, చాలా పాఠశాలలు టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్నాయన్నారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు మరో DSC కూడా ప్రకటిస్తామన్నారు. తద్వారా ఈ డీఎస్సీని ఆపేది లేదంటూ స్పష్టతనిచ్చారు.