హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన భూప్రకంపనలకు ప్రధాన కేంద్రం ములుగు అని NGRI గుర్తించింది. గోదావరి ప్రాంతాన్ని ఫాల్ట్ రీజియన్ గా భావిస్తుండగా ఇక్కడ తరచూ ప్రకంపనాలు వస్తాయంటున్నారు. ములుగు జిల్లా మేడారంలో పొద్దున 7:27 గంటలకు వచ్చిన ప్రకంపనలకు ప్రధాన కేంద్రం భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉందని తేల్చారు. దీని ప్రభావంతో చుట్టూ 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో భూమి కంపించిందని, ఈ తీవ్రత ఎప్పుడూ ఇలాగే ఉండే అవకాశాలుంటాయన్నారు. తెలంగాణలో వచ్చే భూకంపాల వల్ల పెద్దగా ప్రాణనష్టం ఉండదని, మనం ఉన్న జోన్ అలాంటిదని శాస్త్రవేత్తలు(Scientists) చెబుతున్నారు.