రాష్ట్రంలోని పోలీసు శాఖలో కొన్ని చోట్ల జరిగిన బదిలీలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది. పోలీసుల బదిలీ(Transfers)ల్లో రూల్స్ వయొలేషన్ జరిగిందని ఆరోపణలు వచ్చిన దృష్ట్యా వెంటనే రిపోర్ట్ అందజేయాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ CEC ఆదేశించింది. ఈ మధ్యకాలంలో జరిగిన బదిలీలపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారికి కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్ లెటర్ రాశారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల కోసం పోలీస్ ట్రాన్స్ ఫర్స్ కు సంబంధించి EC గతంలోనే గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం జులై 31కి బదిలీల ప్రక్రియ పూర్తి చేశారు. అయితే ఈ బదిలీల్లో అక్రమాలు జరిగాయని గత 25న CEC కార్యాలయానికి కంప్లయింట్ అందింది.
వరంగల్ కమిషనరేట్ లో అత్యధికంగా 12, భద్రాద్రి కొత్తగూడెంలో 8, రామగుండంలో 3, మహబూబాబాద్ లో 3, ములుగులో 3, జగిత్యాల జిల్లాలో 1 చొప్పున అక్రమ బదిలీలు జరిగాయని ఆ కంప్లయింట్ లో EC అధికారులకు తెలియజేశారు.