వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్(Election commission) ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్న EC… 119 సెగ్మెంట్లకు అధికారుల్ని నియమించే పనిలో పడింది. ఎలక్షన్స్ కి సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పట్నుంచే ఏర్పాట్లను పరిశీలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీని చేపట్టింది. వాటికి సంబంధించిన పోస్టులను ఫైనలైజ్ చేస్తూ RO, AROల రిక్రూట్ మెంట్ కు నోటిఫై చేసింది.
RO, ARO పోస్టులపై గెజిట్ నోటిఫికేషన్ ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసింది. రాష్ట్రంలో అటు రాజకీయ పార్టీల్లోనూ రాజకీయ వేడి మొదలు కాగా… ఈసీ సైతం నియోజకవర్గాల వారీగా రిక్రూట్ మెంట్లకు నిర్ణయం తీసుకుంటోంది.