
ఉపాధ్యాయ నియామక పరీక్ష(Teacher Recruitment Test)కు అప్లయ్ చేసుకున్నారా.. మీరు సమర్పించిన వివరాల్లో తప్పులున్నట్లు గుర్తించారా.. అలాంటి వారి కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు ఈ అవకాశాన్ని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు సమర్పించిన వివరాల్లో మార్పులు, చేర్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు గాను ‘ఎడిట్ ఆప్షన్’ను తీసుకువచ్చింది. ఈ ఆప్షన్ నవంబరు 5 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఎవరైనా ఎడిట్ చేసుకోదలచిన వారు దీన్ని ఉపయోగించుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన స్పష్టం చేశారు.
1,76,527 అప్లికేషన్లు
TRT దరఖాస్తు గడువు ఈ అక్టోబరు 28తో ముగిసిపోయింది. స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్స్(SGT), భాషా పండితులు, పీఈటీలతో కలిపి మొత్తం 5,089 పోస్టులకు అప్లికేషన్లు స్వీకరించారు. ఈ TRTకి 1,76,527 అప్లికేషన్లు రాగా.. SGT తెలుగు మీడియం కోసం 60,190 దరఖాస్తులు అందాయి. వచ్చే ఫిబ్రవరిలో ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నది.