మొన్న జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో స్పౌజ్(Spouse) పాయింట్లు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు(Action) తీసుకుంటామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్ అన్నారు. వ్యక్తిగత సమస్యల విషయంలో న్యాయమైన అప్పీళ్లను సానుకూలంగా పరిష్కరిస్తామని తనను కలిసిన USPC, జాక్టో నాయకులతో అన్నారు.
బదిలీ అయిన SGTలను రిలీవ్ చేసి సర్దుబాట్లు చేస్తామన్న బుర్రా.. సమయాభావం, టెక్నికల్ ఇష్యూతో నష్టపోయిన వారి విషయంలో పాజిటివ్ గా స్పందించారు. ముఖ్యంగా SGT వెబ్-ఆప్షన్స్ సందర్భంగా అప్రకటిత రేషనలైజేషన్ అమలుతో ఖాళీలను బ్లాక్ చేయడం, టైమ్ తక్కువ ఇవ్వటం, ట్రాన్స్ఫర్ అయిన వారందర్నీ రిలీవ్ చేయక నష్టం జరిగిందని, స్కూళ్లల్లో సమతుల్యత లోపించిందని సంఘాల నేతలు వివరించారు.
సానుకూలమని…
పొరపాటుగా ఆప్షన్స్ ఇచ్చి నష్టపోయినవారి అప్పీళ్లను పరిశీలించడం.. ప్రమోషన్లలో నాన్ జాయినింగ్, లెఫ్ట్ ఓవర్ ఖాళీలకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించడం.. మల్టీజోన్-1&2లో ఖాళీగా ఉన్న హైస్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టుల్ని పదోన్నతులతో భర్తీ చేయడం.. పరస్పర బదిలీ ద్వారా జిల్లాలు మారిన వారికి ప్రస్తుత పోస్టులో రెండేళ్ల సర్వీసు పూర్తయినందున మిగిలిపోయిన ఖాళీల్లో DSC నియామకాల కంటే ముందుగా బదిలీ అవకాశం కల్పించాలన్నారు.
వీటిపై నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని వెంకటేశం తెలిపినట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(USPC), జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్(జాక్టో) నేతలు తెలిపారు. అంతకుముందు వీరంతా విద్యాశాఖ డైరెక్టర్ ఇ.వి.నరసింహారెడ్డిని కలిశారు.
ఉన్నతాధికారుల్ని కలిసిన వారిలో కె.జంగయ్య, జి.సదానందంగౌడ్, వై.అశోక్ కుమార్, టి.లింగారెడ్డి, ఎం.రాధాకృష్ణ, యు.పోచయ్య, సీహెచ్ శ్రీనివాస్, బి.కొండయ్య, వీరునాయక్, కొమ్ము రమేశ్, టి.గీతాంజలి, డి.రాజనర్సుబాబు, విఠల్, చావ రవి, పి.నాగిరెడ్డి, ఎం.సోమయ్య, చంద్రశేఖర్, గౌరీ శంకర్, శర్మన్ ఉన్నారు.