
రాష్ట్రంలో మరో ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతి లభించింది. ప్రతి నూతన జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ కొత్త కాలేజీలు అందుబాటులోకి రాబోతున్నాయి. జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, యాదాద్రి భువనగిరి, ములుగు, వరంగల్ జిల్లాల్లో ఈ కాలేజీలు రానున్నాయి. దీంతో రాష్ట్రంలో MBBS సీట్లు 10 వేలకు దగ్గరగా వచ్చాయి.