భద్రాచల శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఎన్నికల సంఘం(Election Commission) ఓకే చెప్పింది. రేపటి ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి(Permission) ఇచ్చింది. తొలుత సర్కారు లేఖ రాయడం, దాన్ని EC తిరస్కరించడం, మరోసారి లెటర్ ను పంపడంతో లైవ్ వేడుకలపై ఉత్కంఠ ఏర్పడింది.
క్షేత్ర వైశిష్ట్యం…
భద్రాచల క్షేత్ర విశిష్టత, కమనీయంగా సాగే కళ్యాణ వేడుక కోట్లాది భక్తులకు నయనానందకరమంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖలో తెలిపింది. ఈ లెటర్ ను గత నెలలోనే పంపితే ఏప్రిల్ 4న ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దీంతో సర్కారు మరో ప్రయత్నంగా ఈ నెల 6న మరో లెటర్ ను పంపింది. వైకుంఠవాసుడు భద్రాద్రిలో సాక్షాత్తూ కొలువుదీరి చతుర్భుజ రామునిగా పూజలందుకుంటున్నాడని, దక్షిణాదిలో అపూర్వ ఘట్టంగా కొలిచే వేడుకలు అత్యంత ప్రాధాన్యమైనవని ECకి విజ్ఞప్తి చేసింది.
మూడున్నర దశాబ్దాలుగా…
రాములోరి కళ్యాణ వేడుకల ప్రత్యక్ష ప్రసారం(Live) 1987లో ప్రారంభమై మూడున్నర దశాబ్దాలుగా రమణీయంగా సాగుతుందని, 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ శ్రీవేంకటేశ్వ భక్తి ఛానల్ లైవ్ ఇవ్వడం.. రేడియోలోనూ మహోత్సవం గురించి వర్ణించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం… ఎట్టకేలకు సానుకూలం(Positive)గా స్పందించింది.