రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మాజీ మంత్రి KTRపై చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్(CEC).. తగిన సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఈనెల 1న వరంగల్ లో మాట్లాడిన మంత్రి సురేఖ.. BRS నేత KTRపై కామెంట్స్ చేశారు. తమ నేతను మంత్రి తీవ్రస్థాయిలో విమర్శించి ఎన్నికల కోడ్(Model Code Of Conduct)ను ఉల్లంఘించినందున చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ నాయకులు ECకి కంప్లయింట్ ఇచ్చారు.
స్టార్ క్యాంపెయినర్ గా, మంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తి మరింత జాగ్రత్తగా మసలుకోవాలని, ఆరోపణలు చేసేటప్పుడు అన్నీ ఆలోచించి మాట్లాడాలని EC తెలిపింది.