ఓటరు నమోదు, సవరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకోసం నాలుగు రోజులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. రేపు, ఎల్లుండితోపాటు సెప్టెంబరు 2, 3 తేదీల్లో స్పెషల్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO) వికాస్ రాజ్ తెలిపారు. పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారని, 2023 అక్టోబరు 1 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు ఓటు కోసం అప్లయ్ చేసుకోవాలని సూచించారు. మరోవైపు ముసాయిదా(Draft) ఓటరు జాబితా(Voter List) బీఎల్వో(BLO)ల వద్ద ఉంటుందని, లిస్ట్ లో పేరుందో లేదో చూసుకుంటూ సవరణలు పరిష్కరించే వీలు కల్పిస్తున్నామన్నారు. ఓటర్ల లిస్టుపై వచ్చిన అభ్యంతరాలు, వినతులపై సమీక్షించాలని, EC నిబంధనల మేరకు కంప్లయింట్స్ అన్నింటినీ క్లియర్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO) అధికారులను ఆదేశించారు. కొత్త ఓట్లు, పాత వాటి తొలగింపులో EROలు రూల్స్ ఫాలో అవ్వాలని స్పష్టం చేశారు.
ఆన్ లైన్లో https://voters.eci.gov.in లేదా voter helpline మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఫారం-6 నింపి నూతన ఓటరు నమోదు, సవరణలు చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్(EC) అవకాశం కల్పిస్తున్నది. బూత్ స్థాయి అధికారి అందుబాటులో లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాలంటూ EROలను ఆదేశించింది. పూర్తి వివరాలకు ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబరు 1950ని సంప్రదించాలని CEO సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కలెక్టర్లతో ఆయన భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి ROలు, AEROలు అటెండ్ అయ్యారు.