ఏడాది కాలంగా సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న సింగరేణి ఎన్నికలు ఎట్టకేలకు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు సాధ్యం(Possibility) కాకపోవడంతో డిసెంబరు 27న వాటిని నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. నవంబరు 28న జరగాల్సిన ఎన్నికల్ని నెల రోజుల పాటు వాయిదా వేస్తూ ఆదేశాలు ఇచ్చింది. లేబర్ అసోసియేషన్ కు ఎలక్షన్ల గడువు ముగిసినా సింగరేణి యాజమాన్యం(Singareni Management) ముందుకు రావడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి.. ఎన్నికలు నిర్వహించాలని గతంలోనే ఆదేశాలిచ్చారు. కొంతకాలం తమకు టైమ్ కావాలని సింగరేణి యాజమాన్యం అడగడంతో.. అక్టోబరులోగా పూర్తి చేయాలని, మరోసారి గడువు కోరకూడదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. వాయిదా విషయంపై ఈ మధ్య మరోసారి కోర్టును సింగరేణి మేనేజ్ మెంట్ శ్రయించడంతో న్యాయమూర్తి నిరాకరించారు.
చీఫ్ జస్టిస్ బెంచ్ కు కేసు
సింగిల్ కోర్టు జడ్జి పర్మిషన్ ఇవ్వకపోవడంతో సింగరేణి మేనేజ్మెంట్.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద అప్పీలు దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఆర్డర్స్ ను కొట్టివేయాలని, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కార్మిక సంఘాల ఎలక్షన్లు వాయిదా వేయాలని కోరారు. 6 జిల్లాల్లో జరిగే పోలింగ్ కు 40 వేల మంది ఓటర్లుండగా.. మూడు జిల్లాలు నక్సల్స్ ప్రభావిత జిల్లాలు అయినందున భారీ భద్రత చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ దృష్ట్యా రాష్ట్రంలోని అధికారులు, పోలీసులు పూర్తి టైమ్ కేటాయించలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి.. వీటిని వాయిదా వేయాలని కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కావాలనే వాయిదా వేయాలని కోరుతున్నాయని సెంట్రల్ లేబర్ కమిషన్ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు.
ప్రభుత్వాన్ని హామీ పత్రం అడిగిన కోర్టు
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం… భద్రతా కారణాల(Security Reasons) రీత్యా ఎన్నికలు వాయిదా వేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చింది. ఈలోపు నవంబరు 30 నాటికి ఓటర్ల ఫైనల్ లిస్టును సమర్పించాలని స్పష్టం చేసింది. డిసెంబరు 27న జరగాల్సిన ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని, ఇందుకు సంబంధించి హామీ పత్రం సమర్పించాలని స్పష్టం చేసింది.