ఎన్నికల విధుల్లో తీవ్ర విషాద ఘటనలు కనిపించాయి. తమకు కేటాయించిన బాధ్యతల్లో భాగంగా పోలింగ్ సెంటర్లకు చేరుకున్న ఉద్యోగులు(Employees) ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఉండి సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న తర్వాత ఇద్దరు సిబ్బంది గుండెపోట్లతో మృత్యువాత పడ్డారు.
చంపాపేట్ మైనార్టీ గురుకుల స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న నరసింహ.. తమకు కేటాయించిన సామగ్రి(Polling Material)తో ఆదివారం సాయంత్రం పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఉక్కపోతగా ఉందంటూ అక్కడే ఫ్యాన్ వద్ద కుర్చీ వేసుకుని కూర్చున్నారు. అదే కుర్చీ నుంచి ఉన్నట్టుండి కుప్పకూలిపోవడంతో నరసింహను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ఆయన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు.
మరో ఘటనలో…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని నెహ్రూ నగర్ 165 పోలింగ్ బూత్ లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో శ్రీకృష్ణ అనే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటుతోనే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు గుర్తించారు. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్ గా శ్రీకృష్ణ ఉద్యోగం చేస్తున్నారు.