ప్రజల కోసం పనిచేసే తాము ఆ జనం కష్టాల్లో ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం అంటూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు(Employees) పెద్ద మనసు చాటుకున్నారు. సర్కారుకు అండగా నిలిచేందుకు భారీ విరాళం ప్రకటించారు. అన్ని ప్రభుత్వ విభాగాల(Departments) ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఒకరోజు మూల వేతనం కలిపి రూ.130 కోట్ల విరాళం అందజేశారు.
కష్టాల్లో ఉన్న ప్రజలను కాపాడేందుకు ఈ విరాళం చేయూతనందిస్తుందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) అభిప్రాయపడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇది అతిపెద్ద విపత్తుగా JAC భావించిందని, సహాయక చర్యల్లో పాల్గొనడమే కాకుండా ఈ భారీ విరాళాన్ని ఉద్యోగులంతా ఇస్తున్నట్లు తెలిపింది. గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తరఫున విరాళం ప్రకటించింది.