రాష్ట్రంలో ఇక కరెంటు(Power) ఛార్జీల పెంపు లేనట్లే. ఏ కేటగిరీలోనూ ఛార్జీల పెంపు లేదని ERC(ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్) ప్రకటించింది. విద్యుత్తు ఛార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనలకు సంబంధించి 8 పిటిషన్లపై తన అభిప్రాయాన్ని ERC తెలియజేసింది. 800 యూనిట్లు దాటితే ఛార్జీలు రూ.10 నుంచి రూ.50కి పెంచుకునేందుకు అందజేసిన ప్రతిపాదనలకు అడ్డు చెప్పడంతో ఇక స్థిర ఛార్జీలు రూ.10గానే ఉంటాయి. చేనేత కార్మికులకు హార్స్ పవర్ ను పెంచిన కమిషన్.. 10 HPని 25కు పెంచింది. 5 నెలల కాలానికి కస్టమర్లపై భారం పడకూడదని కమిషన్ నిర్ణయించిందని ఛైర్మన్ శ్రీరంగారావు తెలిపారు.