Published 30 Nov 2023
రాష్ట్రంలో పోలింగ్ ముగియడంతో ఇక పార్టీల జాతకం మరో మూడు రోజుల్లో తేలిపోనుంది. అయితే ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుందో సర్వే సంస్థలు లెక్కలతో సహా చెబుతున్నాయి. ఆరా సంస్థ సర్వే ప్రకారం రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీదే. BRSకు 41-49 సీట్లువస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 58-67 స్థానాలు రానున్నాయని తెలిపింది. ఇక భారతీయ జనతా పార్టీ(BJP)కి 5-7 సీట్లు… MIM, BSP, CPI 7-9 స్థానాలను కైవసం చేసుకోబోతున్నట్లు తెలియజేసింది. దీని ద్వారా హస్తం పార్టీదే అధికారమని స్పష్టం చేసింది.
సీట్లు, ఓట్ల శాతం ఇలా….
పార్టీ———-సీట్లు———ఓట్ల శాతం
కాంగ్రెస్—–58-67———41.13
బీఆర్ఎస్—-41-49———39.58
బీజేపీ——–5-7———–10.47
MIM, BSP, CPI—7-9—– 8.82