అత్యంత భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాల్లో కల్లోలమేర్పడింది. వరద నీరుతో జాతీయ రహదారి మూతపడగా.. చాలా ప్రాంతాలు ముంపులో ఉన్నాయి. రాజంపేట మండలం అర్గొండ(Argonda)లో పొద్దున 8:30 నుంచి సాయంత్రం 6 వరకు 41.8 సెంటీమీటర్లు పడింది. కుంభవృష్టితో కొన్ని గంటల్లోనే పలు చోట్ల భారీ వర్షపాతాలు రికార్డయ్యాయి. కామారెడ్డిలో 28.1, భిక్నూర్ లో 23.8 లింగంపేట్ లో 20.6 సెంటీమీటర్లు కురిసింది.
ఇక మెదక్ జిల్లాలోనూ దంచికొట్టడంతో హవేలీఘనపూర్ మండలం సార్ధానాలో 26.1, నాగపూర్ లో 23.4 సెం.మీ. పడింది. ఈరోజు నుంచి ఎల్లుండి వరకు 3 రోజులూ తీవ్ర వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో.. ఆ రెండు జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితి ఉంది. చెరువులు, వాగులు భీకరంగా ప్రవహిస్తుంటే, నాగపూర్ గేటు వద్ద ఓ వాహనం కళ్లముందే కొట్టుకుపోగా అందులో ఉన్న వ్యక్తిని SDRF బృందాలు కాపాడాయి.