యూరియా దొరకడం లేదంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ధర్నాలు చేస్తున్నారు. కొరతను తీర్చేందుకు తెలంగాణకు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందిస్తామంటూ కేంద్రం హామీ ఇచ్చింది. ఇది రావడానికి మరో వారం పడుతుండటంతో రైతుల్లో అసహనం పెరిగిపోతోంది. వరి సహా ఇతర పంటలన్నీ ఎదిగే దశలో ఉండటంతో యూరియా(Urea) అవసరమవుతోంది. కానీ సహకార(Cooperative) సంఘాల వద్ద సరిపడా లేకపోవడంతో కర్షకులు కష్టాలపాలవుతున్నారు. కొన్నిచోట్ల సరకును బ్లాక్ చేయడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.